: టీడీపీని ఎవ్వరూ, ఏమీ చేయలేరు: చంద్రబాబు
‘పార్టీ కార్యకర్తల ఫలితంగానే ఈ రోజున నేను, నాయకులు ఈ పరిస్థితిలో ఉన్నాము’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో నిర్వహించిన జన చైతన్య యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజలలో మనకు మంచి పేరు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని.. పార్టీ శాశ్వతంగా ఉంటుందని అన్నారు. పేదలకు అండగా ఉండే పార్టీ టీడీపీ అని, పార్టీ జెండా పేదలకు అండ అని అన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రామ కమిటీలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని బాబు అన్నారు.