: ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాము: సీఎం చంద్రబాబు


ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడానికి ఏమి చెయ్యాలో.. అవి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో నిర్వహించిన జనచైతన్య యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పార్టీని కూడా సమర్థవంతంగా నడపడానికి ఇంకా ఏం చేయాలనే విషయమై ఆలోచిస్తామన్నారు. రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు వంటి సమస్యలు పరిష్కరిస్తామని బాబు హామీ ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. ప్రజల బాగోగులు ఎంత అవసరమో.. పార్టీ కార్యకర్తల బాగోగులు కూడా అంతే అవసరమని, దానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 54 లక్షల పార్టీ సభ్యత్వాలు నమోదు చేశామని, కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో రూ.54 కోట్లు పార్టీ నిధులుగా వచ్చాయని అన్నారు. కార్యకర్తల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని, భారతదేశంలో మరే పార్టీ ఈ విధంగా చేయడం లేదన్న విషయాన్ని పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News