: ఓయూలో బీఫ్ ఫెస్టివల్ కు అనుమతి లేదు: సిటీ సివిల్ కోర్టు


ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ పై హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది జనార్దన్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు, ఓయూలో బీఫ్ ఫెస్టివల్, ఇతర ఎలాంటి ఫెస్టివల్స్ కు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ నెల 20 వరకు వర్శిటీలో స్టేటస్ కో పాటించాలని ఆదేశాలిచ్చింది. పోలీసులు శాంతి, భద్రతలు పరిరక్షించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News