: హైదరాబాదు లో హెలీ టూరిజంను అభివృద్ధి చేస్తాం: మంత్రి చందూలాల్


హైదరాబాదులో హెలీ టూరిజంను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. దాంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి వీక్షించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్ లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. సచివాలయంలో ఇవాళ పర్యాటక శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్ష వివరాలను మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని నల్లమల, వరంగల్ అటవీ ప్రాంతాల్లో ట్రైబల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. అలాగే విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తున్నామని, జనవరిలో హైదరాబాదు లో పెరల్ ఫెస్టివల్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించే పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు.

  • Loading...

More Telugu News