: ఇదేం నిర్ణయం?... 'సరి, బేసి' సంఖ్యల విధానంపై లోక్ సభలో తీవ్ర విమర్శలు


కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన సరి, బేసి సంఖ్యల విధానంపై లోక్ సభలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయం సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఈస్ట్ ఢిల్లీ ఎంపీ మహేష్ గిరి దీనిపై మాట్లాడుతూ, ఈ విధానం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఢిల్లీలోని ఓక్లా ప్రాంతంలో వ్యర్థాలనుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లను మూసేయాలని సూచించారు. వీటి వల్ల అధిక కాలుష్యం విడుదలవుతోందని ఆయన ఆరోపించారు. ఆ పరిశ్రమలను మూసేయాడానికి 2013లోనే ఆదేశాలు సిద్ధమైనప్పటికీ అవి అమలు కాలేదని ఆయన తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను మూసేయకుండా ప్రజలకు నిబంధనలేంటని ఆయన ప్రశ్నించారు. తక్షణం ఆ పరిశ్రమలను మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News