: ప్రకాశం జిల్లాలో బయటపడిన పంచలోహ విగ్రహాలు
ప్రకాశం జిల్లాలో పురాతనకాలం నాటి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామ శివారులో పోలేరమ్మ గుడి వద్ద ఇంటి పునాదులు తవ్వుతుండగా 8 పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. ఓకే పాత్రలో ఆ విగ్రహాలున్నాయి. విగ్రహాలను పురావస్తు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతుండగా, పాతకాలం నాటి ఆలయ శిథిలాలు గుర్తించారు.