: బెంగళూరు వాసుల దాతృత్వం... వరద బాధితులకు లక్ష చపాతీలు!
చెన్నై వరద బాధితులపై కర్నాటక వాసులు దాతృత్వం కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరుకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్త దినేష్ జైన్ .. ‘అమృతధార’ అనే ఫ్యూరిఫికేషన్ ప్లాంట్ ద్వారా మంచినీటిని ఉచితంగా అందించేందుకు రంగంలో దిగారు. తాజాగా, సుమారు లక్ష చపాతీలను వరద బాధితులకు అందజేసేందుకు బెంగళూరు ప్రజలు సిద్ధమమయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు బెంగళూరు వాసులు సోషల్ మీడియా ద్వారా వినూత్న సేవల్ని అందించారు. దీనికోసం వారు ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో, సహాయానికి సంబంధించిన సమాచారం, తక్షణ సహాయాన్నందించే దాతల వివరాలు తదితర సమాచారాన్ని విరివిగా అందించారు.