: భారత్ విజయానికి ఇంకా ఒక్క వికెట్టు!
ఆడినంత సేపు తమ జిడ్డాటతో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, నేడు టీ విరామం తరువాత పేకమేడలా కూలిపోయారు. 297 బంతులను ఎదుర్కొని 43 పరుగులు మాత్రమే చేసిన డివిలియర్స్ వికెట్ ను అశ్విన్ తన ఖాతాలో వేసుకోగా, ఆపై ఎవరూ పెద్దగా ప్రతిఘటన చూపకుండానే వికెట్లు సమర్పించుకున్నారు. డుమినీ 0, ఆబాట్ 0, విలాస్ 13, పెడిట్ 1 పరుగుకు అవుట్ కాగా, ప్రస్తుతం మోర్కెల్ 2, తాహిర్ 0 పరుగులతో ఆడుతున్నారు. భారత విజయానికి ఇంకా ఒక్క వికెట్ మాత్రమే కావాల్సి వుండగా, సౌతాఫ్రికా పరాజయానికి ఒక మెట్టు ముందు నిలిచివుంది.