: టేబుల్ కదిలితే ఏంటో అనుకున్నా!: అమితాబ్ బచ్చన్


బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కోల్ కతాలోని హోటల్ గదిలో టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా, ఆ టేబుల్ చిన్నగా కంపించింది. ఆ హోటల్లో పనుల నిమిత్తం ఏదైనా మిషన్ ను ఉపయోగిస్తున్నారేమోనని తాను అనుకున్నానే తప్పా, భూకంపం వచ్చిందని అనుకోలేదని బిగ్ బీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత హోటల్ సిబ్బంది కూడా ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు. షూటింగ్ నిమిత్తం బిగ్ బీ కోల్ కతాలో ఉన్నారు. భూకంపం ప్రభావం వల్ల ఆ నగరంలో ఎలాంటి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. భూకంపం సంభవించిన మిగిలిన ప్రదేశాల్లో కూడా అంతా బాగుండాలని అమితాబ్ కోరుకున్నారు. కాగా, సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ, పంజాబ్, జమ్మూకాశ్మీర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైంది.

  • Loading...

More Telugu News