: అమరావతిపై ఆ నలుగురు కుట్రలు చేస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
ఏపీ రాజధాని అమరావతిలో వరదలు సంభవిస్తాయని, చెన్నై కన్నా ఎక్కువే ముప్పు పొంచి ఉందంటూ వస్తున్న ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. రాజధానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అమరావతిలో విపత్తులు సంభవిస్తాయంటూ దుష్ప్రచారం చేస్తోందని విజయవాడలో విమర్శించారు. అసలు ప్రకృతి విపత్తులు సంభవించని ప్రాంతం అంటూ ఏదైనా ఉంటే వైసీపీ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అమరావతిపై విమర్శలు చేస్తున్న జగన్, కేవీపీ, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణలు అంగారక గ్రహంపైకి వెళ్లి జీవించాలని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.