: కంపించిన ఉత్తర భారతం... ఢిల్లీ, పంజాబ్, కాశ్మీర్ లలో స్వల్ప భూకంపం


ఉత్తర భారతం కొద్దిసేపటి క్రితం కంపించిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో కొద్దిసేపటి క్రితం స్వల్ప భూకంపం సంభవించింది. తజకిస్థాన్ లో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా ఉత్తర భారతంలోని ఆయా ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంపం కేంద్రం తజకిస్థాన్ లో గుర్తించినట్లుగా అమెరికా జియలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప ప్రకంపనలు సంభవించిన ప్రాంతాల్లో ఇళ్లలో నుంచి ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి వివరాలేమీ వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News