: సుష్మా స్వరాజ్ రేపు పాక్ లో పర్యటిస్తారు!: కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ
కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు రోజుల పాకిస్థాన్ పర్యటన ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పర్యటనపై కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ న్యూఢిల్లీలో మాట్లాడారు. రేపు సుష్మా పాక్ లో పర్యటించనున్నారని తెలిపారు. ఇస్లామాబాద్ వెళ్లి చర్చలు జరిపి భారత్ కు ఆమె తిరిగి వచ్చాక ఓ ప్రకటన చేస్తారని చెప్పారు. పాక్ లో జరగనున్న భద్రతా సదస్సును ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత పార్లమెంట్ ఉభయసభలలో ఈ విషయంపై చర్చిద్దామని అన్నారు. కాగా, థాయ్ లాండ్ లో భారత్, పాక్ ల జాతీయ భద్రతా సలహాదారులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని భారత్ ఆశిస్తోంది.