: కల్తీ మద్యం ఘటనపై చంద్రబాబు ఆరా... విచారణకు ఆదేశం
విజయవాడలోని కృష్ణలంక స్వర్ణ బార్ లో చోటు చేసుకున్న కల్తీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎంకు ఘటన విషయం తెలియడంతో వెంటనే అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బాధితులకు మెరుగైన సాయం అందించాలని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పందించారు. ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకుని చర్యలు తీసుకుంటామని ఓ తెలుగు వార్తా చానల్ కు తెలిపారు.