: ఆ బార్ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుదట... బాధితులంతా కూలీలే!


కల్తీ మద్యం సరఫరా చేసి ముగ్గురి మృతికి కారణమైన విజయవాడలోని స్వర్ణ బార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినదట. నేటి ఉదయం బార్ లో మద్యం సేవించిన 17 మంది అస్వస్థతకు గురి కాగా, వారిలో ముగ్గురు వ్యక్తులు ఇప్పటికే చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై సమాచారం అందిన వెంటనే బార్ కు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సదరు బార్ మల్లాది విష్ణుకు చెందినదిగా చెప్పారు. ఈ ఘటనకు బార్ లో సరఫరా చేసిన మద్యం, లేదంటే అక్కడి నీరే కారణమై ఉంటుందని ఆయన తెలిపారు. ఎక్సైజ్ అధికారుల విచారణలో ఈ ఘటనకు గల పక్కా కారణాలు వెలుగులోకి రానున్నాయని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని ఆయన చెప్పారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని కూడా రామ్మోహన్ రావు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News