: రమాదేవి వర్శిటీ విద్యార్థినులు మానవ బాంబులే: కలకలం రేపిన బీజేడీ నేత వ్యాఖ్యలు


ఒడిశాలోని రమాదేవి ఉమన్స్ యూనివర్శిటీలోని కొందరు విద్యార్థినులు రాజీవ్ గాంధీని హత్యచేసిన మహిళా మానవ బాంబుల వంటివారని బిజూ జనతాదళ్ ఎమ్మెల్యే ప్రియదర్శి మిశ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వర్శిటీని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సందర్శిస్తున్న వేళ, ఆయన పర్యటనకు అడ్డుపడవచ్చని భావిస్తున్న కొందరు విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, 1991లో మహిళా మానవ బాంబు రాజీవ్ గాంధీని హత్య చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ, అదే పరిస్థితి ఇక్కడా ఉందని అనడం విపక్ష పార్టీలను ఆగ్రహానికి గురి చేసింది. తనపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత మిశ్రా ఓ మెట్టుదిగి, తాను కేవలం వీవీఐపీ సెక్యూరిటీ గురించి మాత్రమే మాట్లాడానని, విద్యార్థినులను కించపరిచే ఉద్దేశం లేదని తెలిపారు. ఆపై వర్శిటీ అధికారులు స్పందిస్తూ, పట్నాయక్ వస్తున్నవేళ గుర్తింపు కార్డులు, యూనిఫాం లేకుండా వచ్చిన వారిని మాత్రమే అడ్డుకున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News