: కాంగ్రెస్ నేతలతో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది: షబ్బీర్ అలీ
వరుసగా తమ పార్టీ నేతలను చేర్చుకుంటున్న టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపణలు చేశారు. తమ పార్టీ నేతలతో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దానం నాగేందర్ తమ పార్టీలో చేరుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఓ పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలలో ఓడినంత మాత్రాన కాంగ్రెస్ నిరుత్సాహపడదన్నారు. రాజకీయంగా లబ్ధి కోసమే టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని షబ్బీర్ వ్యాఖ్యానించారు. కాగా ఇవాళ దానం తనను కలసిన సమయంలో పార్టీ మార్పు గురించి చర్చించి ఉండవచ్చని, ఆయనను బుజ్జగించి ఉంటారని సమాచారం.