: సీఎంకి బహిరంగ లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు


పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నేడు సీఎం కిరణ కుమార్ రెడ్డికి ఓ బహిరంగ లేఖాస్త్రం సంధించారు. బయ్యారం గనుల్లో లభ్యమయ్యే ఉక్కు ఖనిజాన్ని తరలించబోమని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలని హరీశ్ రావు పేర్కొన్నారు. సర్కారు సానుకూలంగా స్పందించకపోతే, ఉద్యమం చేపడతామని తెలిపారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయమై ప్రధానిని కలుస్తామని తన లేఖలో వెల్లడించారు. బయ్యారం విషయంలో ఆంధ్ర, తెలంగాణ మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

  • Loading...

More Telugu News