: బెజవాడలో కల్తీ లిక్కర్... బార్ లో మద్యం తాగిన 17 మందికి అస్వస్థత, ముగ్గురి మృతి
నవ్యాంధ్ర పొలిటికల్ రాజధాని విజయవాడ కల్తీకి కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది. ఇప్పటికే కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా నగరంలోని కృష్ణలంక కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎం హోటల్ బార్ (స్వర్ణ బార్)లో మద్యం సేవించిన 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించేలోగానే ఓ వ్యక్తి చనిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ సిబ్బంది బార్ పై దాడి చేసి మద్యం శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. అస్వస్థతకు గురైన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.