: బాక్సైట్ తవ్వకాల శ్వేతపత్రంపై రఘువీరా విమర్శలు


విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ శ్వేతపత్రం పూర్తి మోసపూరితమైందని ఆరోపించారు. అంతేగాక ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో బాక్సైట్ తవ్వకాలపై వాస్తవ పత్రాలను రఘువీరా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఆయన కూడా మాట్లాడుతూ, ఆదివాసీల హక్కుల దినోత్సవం రోజున చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలపై ప్రకటన చేయడం విచిత్రమైన పరిస్థితికి నిదర్శనమన్నారు.

  • Loading...

More Telugu News