: ఇకపై టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత 'జిడ్డు' రికార్డు డుప్లెసిస్ దే!


టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి పరుగును చేసేందుకు అత్యధిక బంతులను తీసుకున్న ఆటగాడిగా డుప్లెసిస్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ ఉదయం ఆమ్లా అవుట్ అయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన డుప్లెసిస్ అత్యంత జిడ్డు ఆటగాడిగా నిలిచి తొలి పరుగు చేసేందుకు 53 బంతులను తీసుకున్నాడు. నిన్న ఆమ్లా తొలి పరుగు చేసేందుకు 45 బంతులాడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ఉదయం వరకూ ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు ఎక్ స్టీన్ పేరిట ఉంది. అతను తన తొలి పరుగుకు 46 బంతులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి ఈ రికార్డు డుప్లెసిస్ ఖాతాలోకి చేరిపోయింది.

  • Loading...

More Telugu News