: కొరుకుడుపడని ఆమ్లాను బోల్తా కొట్టించిన జడేజా... ప్లెసిస్ అంతకన్నా జిడ్డుగా మారాడు!


తన జిడ్డు ఆటతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా వికెట్ ను జడేజా దక్కించుకున్నాడు. దీంతో 42.1 ఓవర్ల పాటు సాగి కేవలం 27 పరుగులు జోడించిన ఆమ్లా, డివిలియర్స్ జోడీ విడిపోయింది. మొత్తం 244 బంతులాడిన ఆమ్లా 25 పరుగులు చేశాడు. ఆపై వచ్చిన డుప్లెసిస్ అంతకన్నా జిడ్డుగా ఆడుతున్నాడు. ఇప్పటివరకూ 47 బంతులను ఎదుర్కొన్న ప్లెసిస్ ఒక్క పరుగు కూడా చేయలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 103 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు కాగా, డివిలియర్స్ 191 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోయి ఉన్నాడు. భారత్ గెలవాలంటే మరో 7 వికెట్లను తీయాల్సి వుంది.

  • Loading...

More Telugu News