: యాసిడ్ పడితే వికలాంగులే... ప్రభుత్వం నుంచి పునరావాసం, పరిహారం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


దేశంలో యాసిడ్ దాడికి గురైన వారందరినీ వికలాంగులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారందరినీ వికలాంగుల చట్టం పరిధి కిందకు తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు పంపింది. యాసిడ్ దాడి బాధితులకు వికలాంగుల చట్టం నిబంధనల కింద ఉచిత చికిత్స, ఆపై పునరావాసం, పరిహారం ఇవ్వాలని కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇతర అంగవికలురు పొందుతున్న అన్ని రకాల ప్రయోజనాలను వీరికీ కల్పించాలని తెలియజేసింది.

  • Loading...

More Telugu News