: పూర్తి స్థాయిలో పనిచేస్తున్న చెన్నై ఎయిర్ పోర్ట్


వారం రోజుల పాటు భారీ వర్షాలు, వరదలతో మూసుకుపోయిన చెన్నై ఎయిర్ పోర్ట్ ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు యథాతథంగా తిరుగుతాయని ఎయిర్ పోర్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి విమానాలు అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. మరోవైపు చెన్నై వాసుల సహాయక చర్యల్లో పాల్గొంటున్న హెలికాప్టర్లు కూడా ఇక్కడ నుంచే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News