: నేటి నుంచి విశాఖలో 'ఇంద్ర నేవీ-15'
సముద్ర జలాలపై యుద్ధ నౌకలు చేసే విన్యాసాలు కళ్లముందుకు రానున్నాయి. ఇండియా, రష్యా దేశాల వార్ షిప్ ల సంయుక్త విన్యాసాలు నేటి నుంచి విశాఖపట్నం వేదికగా ప్రజలను అలరించనున్నాయి. 'ఇంద్ర నేవీ-15' పేరిట విన్యాసాలు రెండు దశల్లో జరగనుండగా, రష్యా క్రూయిజర్ యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. నేడు నౌకాశ్రయం సమీపంలో ఉమ్మడి విన్యాసాలు ఉంటాయని, వీటిల్లో భాగంగా, తేలికపాటి మిసైళ్ల నుంచి రాడార్లు, విమాన విధ్వంసక క్షిపణులు తదితరాలను ప్రయోగించనున్నట్టు అధికారులు తెలిపారు. రెండో దశలో 10వ తేదీన సముద్రంపై విన్యాసాలు ఉంటాయని వివరించారు.