: ‘బీరు’బలులకు శుభవార్త... ‘టేస్టీ’ బీరు వస్తోందట!


ఈ వార్త బీరు ప్రియులకు శుభవార్తే. ఎందుకంటే, ఇష్టమైన బీరు ఇకపై విభిన్న రుచుల్లో లభించనుంది. ఇప్పటిదాకా ఏ బీరు తీసుకున్నా, నోరు చేదెక్కడం ఖాయం. ఎందుకంటే.. బీరు రుచే అది. మరి ఎంత ఇష్టమైన బీరు అయినా చేదుగా ఉంటే కాస్తంత ఇబ్బందే కదా. యూనివర్సిటీ ఆఫ్ విస్కోన్సిన్ శాస్త్రవేత్త విలియం అలెగ్జాండర్ ఈ ఇబ్బందిని గుర్తించారు. వెనువెంటనే ఆయన ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించారు. సరికొత్త రుచులతో బీర్లను ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుందన్న దిశగా ఆయన యోచించారు. అంతే, ‘టేస్టీ’ బీరుల ఎంట్రీకి రంగం సిద్ధమైపోయింది. సాధారణంగా కొన్ని పదార్థాలను పులియబెట్టడం ద్వారా ఈస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఈస్ట్ వల్లే బీరుకు చేదు రుచి వస్తుంది. అయితే హైబ్రిడ్ పద్ధతిలో పలు రకాల ఈస్ట్ లను ఉత్పత్తి చేయడం, వాటిని ఒకదానితో మరొకదానిని కలపడం ద్వారా బీర్లకు సరికొత్త రుచులను తేవడం పెద్ద ఇబ్బందేమీ కాదని విలియం తేల్చేశారు. ఈ దిశగా ఆయన ప్రయోగాలు దాదాపుగా విజయవంతమయ్యాయి. త్వరలోనే ఈ తరహా ‘టేస్టీ’ బీర్లు అందుబాటులోకి రానున్నాయని విలియం చెబుతున్నారు.

  • Loading...

More Telugu News