: సుజనా మాల్ లో సినీ నటుల సందడి...తొక్కిసలాట


'మన మద్రాస్' కోసం అంటూ టాలీవుడ్ నటీనటులు చేపట్టిన కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. మన మద్రాస్ కోసం నిధుల సేకరణకు ప్రముఖ నటులు రానా, అల్లరి నరేష్, నాని, నిఖిల్, లక్ష్మి మంచు, మధుశాలిని, కాజల్ తదితర నటీనటులు కూకట్ పల్లిలోని సుజనామాల్ కు వెళ్లారు. వీరి రాక గురించి ముందుగా తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో సుజనామాల్ కు చేరుకున్నారు. అభిమాన నటీనటులను చూసేందుకు అమితోత్సాహం చూపారు. ఈ సందర్భంగా అభిమాన నటీనటులను చూసేందుకు అంతా ముందుకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. కొంత మందికి గాయలైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News