: నాకు 'సైజ్ జీరో' అవసరం లేదు: రాశీ ఖన్నా


సైజ్ జీరో హీరోయిన్ అనిపించుకోవాలని తనకు లేదని టాలీవుడ్ తాజా అందం రాశీఖన్నా తెలిపింది. తాను తిండిపోతును కాదు కానీ పుష్టిగా ఉంటానని, అయితే తాను ఉన్న రంగంలో ఫిట్ గా ఉండడం చాలా అవసరమని చెప్పింది. అందుకోసం వర్కౌట్లు చేస్తాను కానీ, నాజూగ్గా మారాలనే కోరికతో జీర్ సైజ్ కి రానని చెప్పింది. ఎంత వర్కౌట్లు చేసినా తన బుగ్గలు తగ్గకుండా జాగ్రత్త పడతానని చెప్పింది. తనలో తన బుగ్గలు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పింది. తన మొదటి సినిమా నుంచే తెలుగు నేర్చుకోవడం ప్రారంభించానని తెలిపింది. రామ్ ఎనర్జిటిక్ గా ఉంటాడు, రవితేజ సెట్లో ఉంటే మనకి వయసైపోయిందా? అనిపిస్తుందని, అంత ఎనర్జిటిక్ గా ఉంటాడని రాశీఖన్నా కితాబునిచ్చింది. బెంగాల్ టైగర్ లో మంచి డాన్సర్ తో కలిసి డాన్స్ చేయాల్సిన సన్నివేశంలో కాస్త ఆందోళన కలిగిందని వెల్లడించింది. అయితే తమన్నా సహకారంతో దానిని అధిగమించానని రాశీ ఖన్నా తెలిపింది. తమన్నా మంచి డాన్సర్ అని రాశీ ఖన్నా కాంప్లిమెంట్ చేసింది.

  • Loading...

More Telugu News