: 300 ఏళ్ల నాటి నిధి దొరికింది: కొలంబియా అధ్యక్షుడు


సముద్ర గర్భంలో 300 ఏళ్లకుపైగా సాగిన రహస్య శోధనకు శుభం కార్డు పడింది. 1708లో స్పానిష్ అమెరికన్ కాలనీల నుంచి సేకరించిన బంగారం, వెండి, వజ్రాలు, విలువైన వస్తువులను ఫిలిప్. వి. కింగ్ వద్దకు తీసుకెళ్తున్న స్పెయిన్ యుద్ధనౌక 'శాన్ జోన్' కరేబియన్ సముద్రంలో మునిగిపోయింది. కొలంబియాకు చెందిన ట్రెజర్ హంట్ బృందం దీనిని కనుగొందని ఆ దేశాధ్యక్షుడు జుయన్ మాన్యువల్ శాన్ టోస్ ప్రకటించారు. అప్పట్లో శాన్ జోన్ నౌకకు, బ్రిటిష్ నౌకలకు మధ్య భీకర యుద్ధం జరగగా, ఆ యుద్ధంలో శాన్ జోన్ భారీ నిధితో నీట మునిగింది. నౌక మునిగినా అందులోని కొంత మంది సైనికులు మాత్రం సముద్రాన్ని ఈది బతికి బట్టకట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ నిధిని చేజిక్కించుకునేందుకు వివిధ దేశాలకు చెందిన ట్రెజర్ హంట్ బృందాలు, పురావస్తు శాఖలకు చెందిన శాస్త్రవేత్తలు, టైటానిక్ ను కనుగొన్న బృందం, ఇలా ఎంతోమంది ఈ నౌక కోసం శోధించారు. అయితే ఎవరూ దీని జాడను కనిపెట్టలేకపోయారు. కొలంబియాకు చెందిన ట్రెజర్ హంట్ పరిశోధకుల బృందం దీనిని ఈ నెల 27న కనుగొన్నట్టు ఆ దేశాధ్యక్షుడు శాన్ టోస్ ప్రకటించారు. కరీబియన్ సముద్ర ప్రాంతంలో వెయ్యి వరకు నౌకలు మునిగిపోయి ఉండవచ్చని, అందులో ఆరు నౌకలు ఇలా నిధితో మునిగిపోయి ఉండవచ్చని ప్రముఖ శాస్త్రవేత్త ఫెబియన్ సనబ్రియా తెలిపారు.

  • Loading...

More Telugu News