: ప్రజాస్వామ్య మనుగడకు ప్రతిపక్షం చాలా అవసరం: రాజ్ నాథ్ సింగ్
ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో అంబేద్కర్ వర్ధంతి సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ పాత్ర ఎంతో, ప్రతిపక్ష పాత్ర కూడా అంతేనని అన్నారు. జీఎస్టీ వంటి కీలకమైన బిల్లు తీసుకొచ్చేటప్పుడు ప్రతిపక్షాల పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రూపకర్తగా మాత్రమే వ్యవహరించలేదని, నవభారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన కీలకమైన పాత్ర పోషించారని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.