: భార్యపై కోపంతో బిడ్డల గొంతు కోసిన కసాయి


భార్యపై కోపాన్ని బిడ్డలపై తీర్చుకున్నాడో కసాయి తండ్రి. రాజస్థాన్ లోని చురు జిల్లాలో గులాబ్ ఖాన్ అనే వ్యక్తి తన భార్యతో తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగాడు. భర్తపై ఆగ్రహంతో ఆమె తమ ముగ్గురు కుమార్తెలు, రెండేళ్ల కుమారుడ్ని వదిలి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయిందన్న ఆగ్రహంతో గులాబ్ ఖాన్ తన నలుగురు బిడ్డలను గొంతు కొసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News