: సల్మాన్ కి నేను పోటీయా?...కానేకాదు: అర్బాజ్ ఖాన్
సల్మాన్ ఖాన్ కి తాను పోటీ కానేకాదని అతని సోదరుడు, బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ తెలిపాడు. 'పవర్ కపుల్' అనే టీవీ కార్యక్రమానికి ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా 'బిగ్ బాస్ వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ కు మీరు పోటీగా ఎదుగుతున్నారా?' అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ, 'సల్మాన్ ఎక్కడ? తానెక్కడ?' అని వ్యాఖ్యానించాడు. సల్మాన్ కు పోటీ లేదని ఆయన స్పష్టం చేశాడు. తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నానని, విజయం సాధిస్తే అదే చాలని ఆయన పేర్కొన్నాడు. తమ మధ్య పోటీ అనేది లేదని ఆయన స్పష్టం చేశాడు. కాగా, పవర్ కపుల్ షోలో భార్య మలైకా అరోరా ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ పాల్గొంటున్నాడు.