: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్ లో ఆ పార్టీ సీనియర్ నేత కేకే మాట్లాడుతూ, నిజమాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తున్నామని అన్నారు. విద్యావంతులు టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతారనే పూర్తి విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూపతిరెడ్డి, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపురెడ్డి, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారని ఆయన తెలిపారు. కాగా, వీరిలో నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నపురెడ్డిని నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే.