: టీమిండియా ఓపెనర్లు బౌలర్లయ్యారు


టీమిండియా టెస్టు జట్టు ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ బ్యాటింగ్ కదా చేస్తారు, మరి బౌలర్లేంటి? అనే అనుమానం వచ్చిందా? అవును బౌలర్లయ్యారు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను మార్చి మార్చి ప్రయోగించినా సౌతాఫ్రికా టెస్టు, వన్డే కెప్టెన్ల ఆటతీరును ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయారు. దీంతో కొత్త పథకం వేసిన కెప్టెన్ కోహ్లీ వీరి జోడీని విడదీసేందుకు టీమిండియా ఓపెనర్లకు బంతిని అప్పగించాడు. 5 ఓవర్లు బౌలింగ్ చేసినా వీరు ఎలాంటి ఫలితం సాధించలేకపోయారు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన శిఖర్ ధావన్ ఒక మెయిడెన్ ఓవర్ చేసి 9 పరుగులివ్వగా, రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన మురళీ విజయ్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. సఫారీ బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా (22), డివిలియర్స్ (7) ఆడుతున్నారు. సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. సఫారీలు కోల్పోయిన రెండు వికెట్లు అశ్విన్ ఖాతాలో చేరాయి.

  • Loading...

More Telugu News