: వర్షం ఎఫెక్ట్...ఐటీ పరిశ్రమల నష్టం 400 కోట్ల రూపాయలు


చెన్నైని వరదలు చుట్టుముట్టడం వల్ల ఐటీ కంపెనీలకు సంభవించిన నష్టం 400 కోట్ల రూపాయలని అంచనా వేస్తున్నారు. గత పది రోజులుగా చెన్నై జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. నదులు, కాల్వలు పొంగిపొరలి రోడ్లన్నీ మునిగి, నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. సాధారణ ప్రజానీకం ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్లే దారిలేక, విద్యుత్, రవాణా సౌకర్యాలు లేక గత వారం రోజులుగా చెన్నైలో ఐటీ పరిశ్రమ ఇంచుమించు మూత పడింది. దీంతో ఐటీ పరిశ్రమకు 60 మిలియన్ డాలర్లు అంటే 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇది కేవలం ఐటీ పరిశ్రమ నష్టం కాగా, తాజాగా సంభవించిన వరదల వల్ల తమిళనాడు రాష్ట్రానికి 15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆశాచోమ్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News