: కూతురు సర్టిఫికెట్ల కోసం వెళ్లి కొట్టుకుపోయిన తండ్రి... చెన్నై వరద మిగిల్చిన విషాదం!


చెన్నై వరదల కష్టాన్ని కళ్లకు కట్టే సంఘటన చెన్నైలో వెలుగు చూసింది. తైండీర్ నగర్ గ్రీమ్స్ రోడ్డులో రవీంద్రన్ అనే వ్యక్తి కొరియర్ సర్వీసులో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన నివాసంలోకి నీరు పొటెత్తింది. కళ్ల ముందే ఇంట్లోని సామాన్లు నీటి ఒరవడికి కొట్టుకుపోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో రేషన్, ఆధార్ కార్డులతో పాటు కుమార్తె సర్టిఫికేట్లు కొట్టుకుపోవడం చూసిన రవీంద్రన్ వాటిని వెనక్కి తెచ్చుకునేందుకు నీటిలో దూకాడు. అయితే, నీటి ఉద్ధృతి పెరగడంతో భార్య, కూతురు చూస్తుండగానే, ఆయన వరద నీటిలో కొట్టుకుపోయాడు. మరుసటి రోజు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రవీంద్రన్ మృతదేహం తేలియాడుతూ కనపడడంతో దానిని స్థానికులు అతని నివాసానికి చేర్చారు. దీంతో ఆ ప్రాంతం అంతా విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News