: అమీర్ ఖాన్ పై మరోసారి నిప్పులు చెరిగిన అనుపమ్ ఖేర్
స్టార్ హీరో అమీర్ ఖాన్ పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి నిప్పులు చెరిగాడు. మత అసహనంపై అమీర్ వ్యాఖ్యలు చేయగానే ఢిల్లీలో భారీ ర్యాలీకి తెరతీసిన అనుపమ్ ఖేర్, కుటుంబంతో ఏ దేశానికి వెళ్తావని అమీర్ ను నిలదీశాడు. 'నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం ఈ దేశమే అనే సంగతి నీ భార్యకు చెప్పావా? లేదా?' అంటూ అడిగాడు. తాజాగా మరోసారి అమీర్ పై మండిపడ్డాడు. దిల్, దిల్ హై కీ మాన్తా నహీ సినిమా సమయంలో అమీర్ ఖాన్ కి, ఇప్పటి అమీర్ ఖాన్ కి చాలా తేడా ఉందని చెప్పాడు. కష్టపడి స్టార్ హీరోగా ఎదిగిన అమీర్ ఖాన్ తాను ఏది మాట్లాడినా పర్లేదని భావించి, వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడని అన్నాడు. గతంలో తాను చిత్రీకరించిన ఓ పాత్రను మహేశ్ భట్ వద్ద అమీర్ ఖాన్ చులకనగా మాట్లాడాడని ఆరోపించిన ఆయన, కొంత మంది తాము చెప్పేది మాత్రమే కరెక్టు, మిగతా ప్రపంచం అంతా తప్పు అనే భావనలో ఉంటారని విమర్శించాడు.