: గంగమ్మను శుద్ధి చేద్దాం, డబ్బివ్వండి: ప్రజలకు మోదీ సర్కారు వినతి


పవిత్ర గంగానదిని పరిశుభ్రపరిచేందుకు ప్రకటించిన 'క్లీన్ గంగా' ప్రాజెక్టుకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలు, ప్రవాస భారతీయులకు మోదీ సర్కారు విన్నవించింది. గత సంవత్సరం క్లీన్ గంగా ఫండ్ (సీజీఎఫ్) పేరిట ఓ నిధిని ఏర్పాటు చేయగా, ఇప్పటివరకూ రూ. 88 కోట్ల విరాళాలు వచ్చి చేరాయని, గంగానది పరిశుద్ధీకరణ పనులు జనవరి నుంచి జరుగుతాయని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శశి శేఖర్ వెల్లడించారు. మరిన్ని నిధుల సమీకరణ లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని తెలిపారు. గంగానది శుద్ధి దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధమైందని, ప్రాథమిక దశలో చేయాల్సిన పనులను ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నిధికి ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను రాయితీలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ నెలకు రూ. 10ని గంగానది ప్రక్షాళనకు కేటాయించినా అదే భారీ మొత్తం అవుతుందని, 20 కోట్ల మంది స్పందించినా రూ. 200 కోట్లు జమ అవుతాయని, ప్రతి ప్రవాస భారతీయుడు నెలకో డాలర్ జమ చేస్తే 10 మిలియన్ డాలర్లు పోగవుతాయని శేఖర్ తెలిపారు.

  • Loading...

More Telugu News