: అజింక్య రహానే మరో సెంచరీ... అరుదైన రికార్డు


ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అజింక్య రహానే సెంచరీ సాధించి అరుదైన రికార్డు పొందాడు. ఒక టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ సాధించిన ఐదవ భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డును సునీల్ గవాస్కర్ 3 సార్లు, రాహుల్ ద్రవిడ్ రెండు సార్లు, విజయ్ హజారే, విరాట్ కోహ్లీలు ఒక్కోసారి సాధించి చూపారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో రహానే 127 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్ లో 206 బంతులాడి 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు కాగా, లీడ్ 480 పరుగులకు చేరింది.

  • Loading...

More Telugu News