: రాహుల్ గాంధీతో ముచ్చట పెట్టుకున్న అద్వానీ!
ఈ ఉదయం భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఆయన స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకోవడం కనిపించింది. అటు విధానాల నుంచి ఇటు సిద్ధాంతాల వరకూ పూర్తి భిన్నంగా ఉండే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఇలా కలుసుకుని ముచ్చట్లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్యా ఏం మాటలు దొర్లివుంటాయోనని రాజకీయ వర్గాలు చర్చలకు తెరలేపాయి. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు అంబేద్కర్ కు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.