: ఉగ్రవాదులు మమ్మల్నేమీ చేయలేరు: ఒబామా
ఉగ్రవాదులు అమెరికన్లలో భయాన్ని పెంచలేరని అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం దాగున్నా, దాన్ని అంతమొందించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. కాలిఫోర్నియాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంగా తన వారాంతపు ప్రసంగం చేసిన ఒబామా, ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకొనే క్రమంలోనే కాలిఫోర్నియాలో తెగబడ్డారని తెలిపారు. "మేము అమెరికన్లం. మేము బలవంతులం. మా స్వేచ్ఛను మేము కాపాడుకుంటాం. మమ్మల్ని భయపెట్టలేరు" అని ఆయన అన్నారు. కాగా, కాలిఫోర్నియాపై దాడి చేసిన పాక్ దంపతులను పొగడుతూ, ఐఎస్ఐఎస్ సొంత రేడియో ప్రత్యేక వార్తలను ప్రసారం చేసింది. వారు ఇస్లామిక్ రాజ్యం కోసం మరణించి దేవుడిని చేరిన గొప్పవారని ఉగ్రవాద సంస్థ వ్యాఖ్యానించింది.