: డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో జానారెడ్డి కారు డ్రైవరుకు పరీక్ష... బుగ్గ కనిపించడం లేదా? అంటూ రుసరుస!


గత రాత్రి హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా, మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నేత జానారెడ్డి కారు అటుగా వచ్చింది. దాంతో పోలీసులు ఆ కారును ఆపారు. కారు నడుపుతున్న డ్రైవరుకు మద్యం పరీక్ష చేసేందుకు పోలీసులు యత్నించగా, జానారెడ్డి రుసరుసలాడారు. కారుకు బుగ్గ కనిపించడం లేదా? అని పోలీసులను ప్రశ్నించిన ఆయన, వీఐపీల కార్లనూ ఆపుతారా? అని మండిపడ్డారు. పోలీసుల తీరు బాగాలేదని అన్నారు. పోలీసులు మాత్రం కారు ఎవరిదైనా, డ్రైవరుకు పరీక్షలు తప్పనిసరని చెప్పి తమ పని తాము చేసుకుపోయారు. అయితే, జానారెడ్డి కారు డ్రైవర్ మద్యం సేవించలేదని తెలుసుకుని, ఓ సెల్యూట్ కొట్టి మరీ జానారెడ్డి కారును వెళ్లనిచ్చారు. కాగా, మొత్తం 8 మంది మందుకొట్టి వాహనాలు నడుపుతూ దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News