: మా పార్టీలోకి సిద్ధూ వస్తే...ఆహ్వానిస్తాం: సీఎం కేజ్రీవాల్
తమ పార్టీలోకి రావాలని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కనుక భావిస్తే... తాము స్వాగతం పలుకుతామని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శనివారం హిందుస్తాన్ టైమ్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు కేజ్రీవాల్ పైవిధంగా సమాధానమిచ్చారు. కాగా, త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్న ధీమాలో ఆప్ ఉంది. ఈ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను నిలబెడతారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.