: ట్విట్టర్ సాయంతో... తల్లిదండ్రుల చెంతకు చేరిన బిడ్డ!


చెన్నై వరదల బీభత్సంలో ఒక చిన్నారి తన తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. ఈ చిన్నారి ఫొటోను ట్విట్టర్ లో కొంతమంది పోస్ట్ చేశారు. వరదల కారణంగా తప్పిపోయిందన్న విషయాన్ని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారి ప్రముఖ నటీనటులు శ్రుతిహాసన్, ఐశ్వర్య, ధనుష్, ప్రియా ఆనంద్ తదితరుల దగ్గరకు చేరింది. వాళ్లు మరికొందరికి ఆ ఫొటోను రీ ట్వీట్ చేయడం జరిగింది. ఎట్టకేలకు, ఆ చిన్నారి ఫొటోను గుర్తించిన వారి ద్వారా ఆ పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సినీ స్టార్లు ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News