: చిన్నారుల ఆటవస్తువు పేలుడు... 8 మందికి గాయాలు


చిన్నారులు ఆడుకుంటుండగా జరిగిన పేలుడు సంఘటనలో ఎనిమిది మంది పిల్లలు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలో జరిగింది. బాంబును తలపించే విధంగా ఉన్న ఒక వస్తువుతో చిన్నారులు ఆడుకుంటుండగా హఠాత్తుగా అది పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ సభ్యులు కూడా అక్కడికి వెళ్లారు. తీవ్రత ఎక్కువగా ఉన్న టపాసు బాంబుతో పిల్లలు ఆడుకున్నారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ ఇంద్రజిత్ చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News