: వరద బాధితులకు రూ. 2 కోట్ల విరాళం అందించిన కరూర్ వైశ్యా బ్యాంక్
వరద బీభత్సం చెన్నై వాసులను నిలువునా ముంచేసింది. నగరమంతా నీళ్లే, బాధితుల కళ్లలో కూడా నీళ్లే. వర్షం తెరిపి ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే చెన్నై మహానగరం కోలుకుంటోంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. ఇదే విధంగా పలువురు సెలబ్రిటీలు కూడా ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో, వరద బాధితులను ఆదుకునేందుకు కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) ముందుకొచ్చింది. రూ. 2 కోట్లను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసింది. ఈ సందర్భంగా కేవీబీ ఎండీ, సీఈవో వెంకటరమణ మాట్లాడుతూ, తమిళనాడుకు తమ బ్యాంక్ అండగా ఉంటుందని తెలిపారు.