: నా భర్తకు ఎలాంటి షరతులు పెట్టలేదు: బాలీవుడ్ నటి కరీనా కపూర్
తమ పెళ్లి జరిగి మూడేళ్లయిందని... ఈ మూడేళ్లలో తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉన్నామని ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భార్య, నటి కరీనా కపూర్ ఖాన్ చెప్పింది. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ సందర్భంగా మీడియాతో కరీనా మాట్లాడింది. తమ వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించింది. తన భర్తకు ఏరోజూ తాను షరతులు విధించలేదని.. సైఫ్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. పెళ్లికి ముందు, తర్వాత కూడా సైఫ్ లో ఎటువంటి మార్పు లేదని... చాలా సంతోషంగా ఉన్నామని కరీనా కపూర్ తన మనసులోని మాటను వ్యక్తం చేసింది.