: బీఫ్ ఫెస్టివల్ వద్దు... అది తింటే బుద్ధిమాంద్యం వస్తుంది: పరిపూర్ణానంద స్వామి


ఈ నెల 10వ తేదీన ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను ఉపసంహరించుకోవాలని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి సలహా ఇచ్చారు. కుహనావాదులు చెప్పే మాయ మాటలను నమ్మి, ఇలాంటి పనులను చేయరాదని సూచించారు. పాలిచ్చే ఆవు దైవంతో సమానమని... బీఫ్ తింటే బుద్ధిమాంద్యం వస్తుందని తెలిపారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించే రోజును తాము గోరక్ష దివస్ గా ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రాచీన వేదకాలం నాటి అంశాలను చెబితే ఇక్కడి వారు పట్టించుకోరని... అదే అమెరికా, ఇంగ్లండ్ నుంచి వచ్చిన వాళ్లు చెబితే నిజమని నమ్ముతారా? అని ప్రశ్నించారు. బీఫ్ ఫెస్టివల్ వద్దు... కేవలం ఫెస్టివల్ మాత్రమే జరుపుకుందామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News