: మహారాష్ట్ర సీఎంకు కేసీఆర్ లేఖ... 'లెండి' ప్రాజెక్టు పూర్తికి చొరవ చూపాలని విజ్ఞప్తి
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తాజాగా లేఖ రాశారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన లెండి ప్రాజెక్టు సత్వర పూర్తికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, ముంపు గ్రామాల పునరావాసంపై దృష్టి సారించాలని కోరారు. కేంద్ర జలసంఘం అనుమతులు, పనుల పూర్తిపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ ప్రాజక్టు విషయంలో ఇప్పటికే తమ రాష్ట్ర ప్రభుత్వం రూ.189 కోట్లు డిపాజిట్ చేసినట్టు తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.275.83 కోట్ల నుంచి రూ.554.54 కోట్లకు పెంచామని స్పష్టం చేశారు. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు తగు ఆదేశాలు ఇవ్వాలని ఫడ్నవీస్ ను కోరారు.