: ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజంపై పోరాడాలి: నాయిని


ఉగ్రవాదాన్ని ఏ మతమూ ప్రోత్సహించదని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. టెర్రరిజంతో ప్రపంచ దేశాలన్నింటికీ ముప్పు పొంచి ఉందని... ఈ నేపథ్యంలో, అన్ని దేశాలు ఉగ్రవాదంపై పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఈ రోజు 'పాలస్తీనా ప్రజల అంతర్జాతీయ ఐక్యత దినోత్సవం' జరిగింది. ఇండో-అరబ్ ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన నాయిని ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. హింసతో సాధించేది ఏమీ లేదని ఆయన అన్నారు. పలు అరబ్ దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News