: చండీయాగానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆహ్వానించిన కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ తాను తలపెట్టిన అయుత చండీయాగానికి పలువురిని ఆహ్వానిస్తున్నారు. ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ బోస్లేను స్వయంగా ఆహ్వానించారు. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహిస్తున్న యాగానికి విచ్చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ లను యాగానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. యాగాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News